తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు ఏర్పుచుకున్నారు నటి కైరా అద్వాని. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి భరత్ అనే నేను సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ భార్య నటి నమ్రతతో స్నేహం ఏర్పడిందట ఈ అమ్మడుకి. ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారని ఫిలిం జనాలు అనుకుంటున్నారు.
తాజాగా ఈ అమ్మడు మహేష్ ఇంటికి వెళ్లి సందడి చేసిందట. నమ్రత, సితారతో కలిసి రోజంతా ముచ్చటించినట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరితో కలిసి దిగిన ఫోటోను కైరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసంది. నమ్రతో ఏర్పడిన చనువు వల్లే హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి నమ్రతను కలుస్తోందని ఫిలిం నగర్లో వార్తలు వస్తున్నాయి.
తాజాగా కైరా అద్వాని చరణ్.. బోయపాటి సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో కైరాకి చాన్స్ ఇవ్వాలని చరణ్ ని నమ్రత అడగడం వల్లే.. ఆమెకు అవకాశం వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తెలుగులో వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు.