హాట్ స్టిల్స్‌తో కియారా అద్వానీ..

46
kiara

భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ కియారా అద్వానీ. తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన కియారా..తన అందంతో ఎంతోమంది అభిమానులను గెలుచుకుంది. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియా,ఫోటో షూట్‌లో హీట్ పెంచేస్తుంది. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ -శంకర్‌ దర్శకత్వంలో నటిస్తుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గతంలో రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాలో మెప్పించింది కియారా అద్వానీ. తాజాగా మళ్లీ రామ్‌ చరణ్‌తో నటించనుండగా చెర్రీకి ఇది 15వ సినిమా .శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో 50వ సినిమా కాగా దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.