మద్యం మత్తులో టాలీవుడ్ హీరోయిన్‌ హల్‌చల్‌..

266
- Advertisement -

ముంబైలో టాలీవుడ్ హీరోయిన్‌ కావ్యా థాపర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ముంబైలో మద్యం సేవించి కారు నడిపి, ఓ వ్యక్తిని గాయపర్చిన కేసులో పోలీసులు కావ్యా థాపర్ ను అరెస్ట్ చేశారు. అంతేకాదు, డ్యూటీలో ఉన్న పోలీసులపైనా ఆమె నోరు పారేసుకుంది. టాలీవుడ్‌లో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాఫిగ్ అయింది.

ఈ ఘటన గురువారం వేకువజామున జరిగింది. ముంబైలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్ వద్ద ఆమె తన వాహనంతో మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి. దాంతో కావ్యా థాపర్ సదరు కారు డ్రైవర్ ను దూషించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా, వారిపై కూడా అసభ్య పదజాల ప్రయోగం చేసింది. నటి చేసిన రచ్చకు ముంబై పోలీసులు షాక్ కు గురయ్యారు. దీంతో హీరోయిన్‌ కావ్య తాపర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు మెట్రోపాలిటన్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా, జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఇక మోడలింగ్ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించిన కావ్యా థాపర్ ముంబయిలో నివసిస్తోంది. టాలీవుడ్‌లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఏక్ మినీ కథ చిత్రంలో నటించి సక్సెస్ అందుకుంది.

- Advertisement -