అమ్మ‌నైతే.. ఐట‌మ్ సాంగ్ చెయ్యొదా..?

320
Kasthuri
- Advertisement -

నిన్న‌టి త‌రం క‌థానాయిక‌ల‌లో తెలుగు తెర‌పై ఓ వెలుగు వెలిగిన న‌టి క‌స్తూరి. ఆమె న‌ట‌న, అంద‌చందాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను చేరువ‌య్యారు. తెలుగులో సొగ్గాడి పెళ్లాం.. మా ఆయ‌న బంగారం వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఆ త‌ర్వాత ఆమె సినిమాల‌ నుంచి త‌ప్పుకుని వ్య‌క్తిగ‌త జీవితంపై దృష్టి పెట్టారు.

Kasturi

మ‌ళ్లీ 2010లో త‌మిళ ప‌దం అనే సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టారు. ఆమె వ‌య‌సుకి త‌గ్గ క‌థ‌లు చేస్తూ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో ఆమె త‌మిళ‌పదంకి సీక్వెల్ గా రూపొందిన త‌మిళ‌ప‌దం 2.0 సినిమాలో ఐట‌మ్ సాంగ్ లో న‌టించారు. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ ని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో ఈ అమ్మ‌డు ఐట‌మ్ సాంగ్ లో మెరిసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

ఆమె గ్లామర్ కాపాడుకుంటూ వ‌స్తోన తీరుప‌ట్ల చాలా మంది అభినందించారు. కానీ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ అభిమాని ‘పెళ్లైన త‌ర్వాత బాధ్య‌త గ‌ల త‌ల్లిగా ఉండాల్సిన ఓ మ‌హిళ ఇలా ఐట‌మ్ సాంగ్స్ చేయ‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్..? అంటూ ప్ర‌శ్నించాడు. ఇందుకు ఆ అభిమానికి క‌స్తూరి అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చింది.

‘పెళ్లైన మ‌గ‌వాళ్లు మ‌ద్యం సేవించే స‌న్నివేశాలు.. ఐట‌మ్ సాంగ్స్ చేస్తున్నారు క‌దా..? మ‌రి వాళ్ల‌కి పిల్ల‌ల ప‌ట్ల బాధ్య‌త ఉండాల్సిన అవ‌స‌రం లేదా..? ఈ విషయం వాళ్ల‌ను ఎందుకు ప్ర‌శ్నించ‌రు? అని చెప్పుకొచ్చారు. అమ్మ‌నైనంత మాత్రాన ఐట‌మ్ సాంగ్ లో చేయ‌కూడ‌ద‌నే రూల్ ఏం లేదుగా..? ఇప్పుడిప్పుడే స్త్రీ, పురుషులు స‌మానం అని బ‌య‌టి ప్ర‌పంచానికి తెలుస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో పిచ్చి పిచ్చి ప్ర‌శ్న‌ల‌తో దానిని పాతాళానికి తొక్కేయ‌కండి అంటూ స‌మాధానమిచ్చింది.

- Advertisement -