శృంగార సన్నివేశాలపై కాజల్ ఆసక్తి

107
- Advertisement -

కాజల్ అగర్వాల్ అగ్ర కథానాయిక. సాధారణంగా ఈ రేంజ్ పెద్ద హీరోయిన్లు పెళ్లి అయ్యి, తల్లి అయ్యాక శృంగార సన్నివేశాల్లో నటించేందుకు అంత తొందరగా ఒప్పుకోరు. అలాంటి సీన్లకు దూరంగా ఉంటారు. అందాల ఆరబోత విషయంలో కూడా కాస్త మొహమాటం చూపిస్తూ ఉంటారు. కానీ, కాజల్ అగర్వాల్ మాత్రం మొహమాటం లేదు అంటుంది. తాను తల్లి అయినప్పటికీ.. అందాల ఆరబోతలో వెనకాడను అంటుంది. తాజాగా కాజల్ అగర్వాల్ ఒక వెబ్ సిరీస్ ఒప్పుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ రాబోతుంది. పెళ్లి అయిన ఓ యువతికి భర్త నుంచి సుఖం అందకపోతే.. ఆ యువతి ఏం చేయాలి ? అనేది మెయిన్ పాయింట్. పాయింట్ లోనే బోల్డ్ నెస్ ఉంది. కాబట్టి.. ఈ సిరీస్ లో చాలా బోల్డ్ సీన్స్ ఉన్నాయట.

అయినా, కాజల్ అగర్వాల్ ఏ మాత్రం షరతులు పెట్టకుండా ఈ సిరీస్ లో నటించడానికి అంగీకరించింది. బోల్డ్ సీన్స్ చేయడానికి కూడా కాజల్ అగర్వాల్ ఆసక్తి చూపిస్తోంది. బహుశా భారీ రెమ్యునరేషన్ కి ఆశ పడి, కాజల్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ, కాజల్ ఇంతకుముందెప్పుడూ హద్దులు దాటి ‘ఆ రకం’ సీన్లు చెయ్యలేదు. కానీ, ఇప్పుడు వెబ్ సిరీస్ ల్లో ముద్దు సీన్లు, బెడ్ సీన్లు, బూతు మాటలు సర్వసాధారణం అయ్యాయి. అందుకే, కాజల్ కూడా చేయడానికి ఒప్పుకుందట. బికినీల్లో కనిపించడం, అందాల ఆరబోతకి కాజల్ అడ్డు చెప్పదు కానీ, మరీ పరిధి దాటి కాజల్ ఎప్పుడు బరితెగించలేదు.

Also Read:కాంగ్రెస్‌ గూటికే పొంగులేటి?

నిజానికి ఇప్పటివరకు కాజల్ అగర్వాల్ పెద్దగా ముద్దు సీన్లలో కూడా నటించలేదు. ఆమె అలాంటి వాటికి వ్యతిరేకం. మరి పెళ్లి అయ్యాక, పైగా తల్లి అయ్యాక కాజల్ అగర్వాల్ లో ఏ మార్పు వచ్చిందో గానీ, శృంగార సన్నివేశాలకు ఓకే చెప్పేసింది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో బాలయ్య బాబు – అనిల్ రావిపూడి మూవీ చేస్తోంది. అలాగే శంకర్ – కమల్ హాసన్ ఇండియన్ 2 లో కూడా కాజల్ నటిస్తోంది.

Also Read:అంబలితో ఆరోగ్యం..

- Advertisement -