సినిమాల్లోని స్త్రీ జీవితం చాలా విచిత్రమైనది. వెలుగు ఉన్నప్పుడే చుట్టూ చేరతారు. వయసు ఉన్నప్పుడే ఆస్వాదన కోరుకుంటారు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటే.. సినిమా ఇండస్ట్రీలో సెట్ అవ్వదు. ఒకప్పుడు ఆమె గొప్ప అందగత్తె. ఆమె పేరు వింటే.. కుర్రాళ్ళు ఉగిపోయేవారు. అంతెందుకు.. ఆ రోజుల్లో రాజకీయ ప్రముఖులు సైతం ఆమె కోసం పరితపించే వారు. ఆమె పేరే జయసుధ. అలాంటి స్టార్ నటీమణి తన 64 సంవత్సరాల వయసులో కూడా కెరీర్ కోసం పడిగాపులు గాస్తోందో అంటేనే.. ఆశ్చర్యంగా ఉంది.
అప్పుల కుప్పలో పడి, నలిగిపోతున్న జీవితంతో పోరాటం చేయడం అంత సామాన్యమైన విషయం కాదు. కానీ, జయసుధకి ఇలాంటి పోరాటలు కొత్తేమీ కాదు. కానీ ఆమె ఇప్పుడు పెద్దావిడ అయిపోయింది. అందుకే, మళ్లీ ఇండస్ట్రీలో నిలబడి అప్పులు తీర్చుకోవడం కష్టం. బహుశా అందుకే.. జయసుధ రాజకీయాల వైపు చూస్తోంది. జీవితంలో ఒకానొక సమయంలో ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడూ ఇష్టపూర్వకంగానో, అయిష్టంగానో కొన్ని సంబంధాల్లోకి తోయబడతారు. అది పెళ్లి కావచ్చు, సహజీవనం కావచ్చు. మరేదైనా అవసరం కావచ్చు. జయసుధ వ్యక్తిగత కారణాల వల్ల ఏడాది పైగానే ఆమె అమెరికాలో ఉండి వచ్చారు.
Also Read:హిమాలయాలకు రజినీ..జైలర్ పరిస్థితేంటి?
ఆ సమయంలో ఆమెకు ఓ అమెరికన్ తోడుగా నిలబడ్డాడు. ఆ తోడు ఆమెకు భరోసాగా అనిపించింది. ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. 63 సంవత్సరాల వయసులో కామం కంటే కూడా స్నేహమే ఎక్కువ ఉంటుంది. ఆ స్నేహం కారణంగానే జయసుధ ఆ వ్యక్తిని తనతో పాటు ఇండియాకి పిలిచింది. అతను కూడా వచ్చాడు. ఇద్దరి కలిసి కొన్ని ఫంక్షన్స్ కి కూడా హాజరు అయ్యారు. ఐతే, ఆ వ్యక్తిని జయసుధ మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ పుకార్లు వండారు. కానీ, ఆ వ్యక్తి ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. జయసుధ మళ్లీ ఒంటరి అయ్యింది. అందుకే రాజకీయాల్లోకి వెళ్ళింది. ఆమెకు ఇప్పుడు కావాల్సింది ఓ తోడు, అప్పులు తీర్చుకునే మార్గం. అందుకే.. ఆ అవకాశాల కోసం జయసుధ పరితపిస్తోంది.
Also Read:Pawan:ఓజీ ఫస్ట్ లుక్ అప్డేట్