64 ఏళ్ల నటికి పెళ్లా ?

123
- Advertisement -

భర్త నితిన్ కపూర్ చనిపోయిన ఐదేళ్ల తర్వాత సహజనటి జయసుధ ఇంకో పెళ్ళికి సిద్ధమవుతున్నట్లు ఇటీవల పుకార్లు వినిపించాయి. అమెరికాకు చెందిన ఓ వ్యక్తితో ఆమె గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఆ వ్యక్తినే జయసుధ పెళ్లి చేసుకోబోతుంది అని ముహుర్తాలు ఫిక్స్ చేసింది ఫేక్ మీడియా. ఐతే, జయసుధ వాటిని తోసిపుచ్చింది. సినిమా నటీమణులను చులకనగా చూసే ధోరణి వల్లే ఇలాంటి అబద్దాలను వండి వారుస్తున్నారు అని జయసుధ తన అసహనాన్ని వ్యక్తం చేసింది.

మొత్తానికి జయసుధకు రెండో పెళ్లి అనేది పూర్తిగా అబద్ధం అని తేలిపోయింది. ఇక జయసుధ రెండో పెళ్లి సంగతి పక్కన పెడితే, నటిగా మాత్రం మళ్ళీ బిజీ అవుతోంది. నిజానికి తన భర్త చనిపోయిన రెండు నెలలకే జయసుధ సెట్స్ పైకి వచ్చింది. ఇప్పుడు తెలుగు – తమిళ సినిమాలతో బిజీగా ఉంది. జయసుధ ప్రస్తుతం సీనియర్ హీరోలకు భార్యగా నటిస్తోంది. అలాగే తల్లి పాత్రలు చేస్తోంది.

కానీ తమిళంలో ఇంకా కీలక పాత్రలకు జయసుధ షిఫ్ట్ కాలేదు. ఐతే, జయసుధకి ఇప్పుడు తమిళంలో కూడా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. పైగా ఆమెకంటూ అక్కడ ప్రత్యేక గుర్తింపు ఉంది. అన్నట్టు త్వరలోనే పలు టీవీ షోలకు జడ్జ్ గా కూడా వెళ్లాలని జయసుధ ప్లాన్ చేసుకుంటుంది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా జయసుధ నటించాలనుకుంటుంది. మొత్తానికి జయసుధ రెండో పెళ్లి వ్యవహారం పూర్తిగా అబద్దమే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -