ప్రజల అత్యాశే పెట్టుబడి..ప్రజలు ఎలా మోసపోతారో కళ్లకు కట్టినట్లు చూపించే సినిమా బ్లఫ్ మాస్టర్. సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో రియల్ లైఫ్‌లో ప్రజలను కేటుగాళ్లు ఎలా మోసం చేస్తారో రీల్ లైఫ్‌లో చూపించారు. సేమ్ టూ సేమ్..మక్కీకి మక్కీ దింపేశాడు ఓ తమిళ నటుడు.
అలనాటి అందాల నటి జయచిత్ర కుమారుడు అమరేశ్ గణేష్ ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త నేదుమారన్‌ను రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేసినట్లు నిరూపణ కావడంతో అతడిపై పోలీస్ కేసు నమోదైంది. దాదాపు నేదుమారన్ నుండి రూ, 26 కోట్లు రాబట్టినట్లు నిందితుడు ఫిర్యాదు చేయడంతో అమరేష్‌పై కేసు నమోదుచేశారు పోలీసులు.
తమ వద్ద ఓ ఆలయానికి చెందిన మహిమగల కలశం ఉందని, దాన్ని ఖరీదైన లోహం ఇరేడియంతో తయారు చేశారని అమరేశ్, అతడి స్నేహితులు వ్యాపారిని నమ్మించారు. అది దగ్గర ఉంటే సంపదే సంపద అంటూ చెప్పడంతో నేదుమారన్‌కు ఆశ కలిగింది. దాదాపు 2013 నుంచి మూడేళ్లలో వారు అడిగినంత డబ్బు దాదాపు 26 కోట్ల రూపాయలు ముట్టజెప్పాడు. కానీ ఎంతకీ కలశం ఇవ్వకపోవడంతో చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నేరుగా ఫిర్యాదు చేసి జరిగిందంతా వివరించాడు. దీంతో ఛీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు జయచిత్ర తనయుడు అమరేశ్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.