జగపతి బాబు హీరోగా దాదాపు 100 చిత్రాలలో నటించాడు, పైగా కథానాయకుడిగా ఏడు నంది పురస్కారాలను అందుకున్నాడు. అప్పట్లో కుటుంబ కథా చిత్రాలకు జగపతి బాబు కేరాఫ్ అడ్రస్. అంతేనా.. కుటుంబ కథా చిత్రాలే కాకుండా.. నటుడిగా ఎన్నో ప్రయోగాలు కూడా చేశాడు. గాయం, అంతఃపురం, ప్రవరాఖ్యుడు, లెజెండ్ ఇలా జగపతి బాబు పోషించిన పాత్రలు నేటికీ అలరిస్తూనే ఉంటాయి. అలాంటి హీరో కమ్ బిజీ నటుడు తన సినీ కెరీర్ లో జరిగిన షాకింగ్ విషయాలు చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటుడు జగపతి బాబు.. ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే… ‘నాకు బాగా గుర్తుండిపోయిన ఒక చేదు సంఘటన చెబుతాను. సాహసం సినిమాలో నేను సెకండ్ హీరో. ఆ మూవీ షూటింగ్‌లో ఏడు రోజులపాటు నాకు తిండిపెట్టలేదు, కనీసం తింటారా ? అని కూడా ఎవ్వరూ అడగలేదు. కనీసం, కూర్చోవడానికి కూడా కుర్చీ వేయలేదు’ అని జగపతి బాబు చెప్పుకొచ్చారు. జగపతి బాబు లాంటి హీరోకి సినిమా షూటింగ్‌లో అన్నం పెట్టకపోవడం నిజంగా షాకింగ్ విషయమే.
అలాగే జగపతి బాబు నెపోటిజం కూడా కామెంట్స్ చేశారు. గత కొన్నేళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం, నెపోకిడ్స్ అనే పదాలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ విషయం పై జగపతి బాబు స్పందిస్తూ.. “ఇండస్ట్రీలో ఈ మధ్య నెపోటిజం .. నెపోకిడ్స్ అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తండ్రుల బ్యాక్ గ్రౌండ్ అనేది, కేవలం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే వరకే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఎవరి కష్టం వారు పడాల్సిందే” అని జగపతి బాబు చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి..