సినీ నటి హరితేజ త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెపుతున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని నెలలుగా ఆమె షూటింగులకు దూరంగా ఉంది. హరితేజ అంటే అంతకు ముందు చాలా మందికి పరిచయం లేదు కానీ బిగ్ బాస్‌కు వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగా పరిచయం అయిపోయింది.
హరితేజ తొలుత సీరియల్స్ లో నటించింది. అనంతరం బుల్లితెరపై తన యాంకరింగ్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమాలలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్యారక్టర్ నటిగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. బిగ్ బాస్ లో సైతం బుల్లితెర అభిమానులను అలరించింది. నాలుగేళ్ల క్రితం దీపక్ రావు అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కడుపులో పెరుగుతున్న తన బిడ్డను చూసుకుని మురిసిపోతుంది హరితేజ.