గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న బిగ్ బాస్ దివి..

73
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి. ఈ సందర్భంగా దివి మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్బుతమని కొనియాడారు.

పొల్యూషన్ ని అరికట్టాలంటే మొక్కలు ఎంతగానో అవసరం అని అన్నారు.ప్రతి ఒక్కరు ఒక్క మొక్కనైనా నాటాలి అని పిలుపునిచ్చారు.మొక్కలు అన్న,గార్డెనింగ్ అంటే చాలా ఇష్టమని ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని దివి అన్నారు. అనంతరం డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య,డాక్టర్ మంజుల,ఆర్జె సునీత,ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇచ్చారు దివి.

- Advertisement -