మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2020గా దివి

64
actress divi

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2020 టెలివిజన్‌ గా బిగ్ బాస్ బ్యూటీ దివి ఎంపికైంది. ఈ సందర్భంగా మాట్లాడిన దివి….నేను ప్రస్తుతం షాక్‌లో ఉన్నాను. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ట్యాగ్ చాలా పెద్దదని తెలిపింది.

నా అందం కంటే, ప్రజలు నా పాత్రను ఆరాధిస్తారు. నేను మానసికంగా అందంగా ఉండాలనుకుంటాను. అందం కాలంతో మారుతుంది. కానీ మీ తెలివితేటలు మీతోనే ఉంటాయని తెలిపింది దివి. ఇక తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలో తెలిపింది దివి.

తాను ఎప్పుడూ అబ్బాయిల్లో హైట్ చూస్తానని..నా హైట్ 5’8 ఉన్నాను కాబట్టి ఆ వ్యక్తి కనీసం 6’2 లేదా 6’3 ఉండాలి. రెండవ విషయం అతని తెలివితేటలు. అతను తెలివైనవాడు కావడం నాకు చాలా ముఖ్యం అని తెలిపింది. చిరంజీవి చిత్రంలో ఆఫర్ కొట్టేసిన దివి ‘లంబసింగి’ అనే చిత్రంలో కూడా నటిస్తోంది.