హైదరాబాద్‌లో దీపిక పదుకొణే సందడి..!

142
Deepika Padukone
- Advertisement -

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్-కె’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా టైటిల్‌ను తర్వాత ప్రకటించనున్నారు. ఈ చిత్రం ఓ సైన్స్ ఫిక్షన్ కథాంశంగా ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరగనుంది.

అయితే ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకు దీపిక శనివారం హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఈమేరకు ఆమెకు చిత్రబృందం స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో స్పందించింది. రాణి గారికి స్వాగతం అంటూ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

- Advertisement -