పాపం… ఆ నటి పెళ్లి వాయిదా

255
Bhavana
- Advertisement -

నటి భావన గుర్తుందా… పలు దక్షిణాది భాషల్లో హీరోయిన్‌గా నటించిన భావనను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. ఆ మధ్య ఆమెపై కిడ్నాప్, అత్యాచారయత్నం జరగడంతో భావన పేరు మీడియాలో మారుమోగిపోయింది. దీనికి తోడు భావన కిడ్నాప్ కేసులో మలయాళ టాప్ హీరో దిలీప్ నిందితుడిగా ఉండటం.. జైలు పాలవడం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటికి వచ్చారు.ఇదిలా ఉంటే ఇప్పుడు మరోవార్త సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

bhavana-naveen.

భావన అత్యాచారయత్నం జరిగిన తరవాత కొన్ని రోజులకు తేరుకున్న ఆమె.. కన్నడ నిర్మాత నవీన్‌తో కొత్త జీవితం గడపాలని నిర్ణయించకున్నారు. ఈ మేరకు నిశ్చితార్థం కూడా జరిగింది. అక్టోబర్ 26న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పెళ్లి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో భావన స్వయంగా ఈ విషయాన్ని వెళ్లడించారట. తమ పెళ్లి వాయిదా వేసుకున్నామని, జనవరి మూడో వారంలో పెట్టుకోవాలని అనుకుంటున్నట్లు భావన తెలిపారట. అయితే తేదీ ఇంకా నిర్ణయించాలన్సి ఉందని చెప్పారట. ఇవన్నీ చెప్పిన భావన.. పెళ్లిని ఎందుకు వాయిదా వేశారో చెప్పలేదట. దీనిపై అనేక రూమర్లు వినిపిస్తున్నప్పటికీ.. ప్రస్తుతం భావన ‘తగరు’ అనే కన్నడ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లే పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం.

- Advertisement -