- Advertisement -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేనలో భాగంగా ఈ రోజు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు నటి ఆయూష పటేల్. ఈ సందర్భంగా ఆయూష మాట్లాడుతూ ఈ రోజు నా వంతుగా నేను మొక్కను నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. మొక్కలు మానవ మనుగడకు ఎంతో ఉపయోగం అన్నారు. రేపటి తరాలకు మనం ఇచ్చే ఆస్థి కేవలం మంచి వాతావరణం అన్నారు.
ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలని అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం లో అవకాశం కల్పించిన జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో భోజ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా హరిహర వీరమళ్ళు డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారు, నందిని రాయ్ గారు,దినేష్ తేజ్ గారు మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -

