బన్నీతో దీపికా..అఫిషియల్!

9
- Advertisement -

అల్లు అర్జున్ – అట్లీ దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణే ఫైనల్ అయింది. క్వీన్ దీపికా పదుకొనే ఈ ప్రాజెక్ట్ లోకి అడుగుపెడుతున్న విషయాన్ని చెబుతూ, ఓ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

డైరెక్టర్ అట్లీతో దీపికా పదుకొనె మాట్లాడే సన్నివేశాలతో ప్రారంభమైన ఈ వీడియో ఆమె శక్తివంతమైన పాత్రలోకి మారుతున్న విధానాన్ని చూపించిన తీరు అందరిలో ఉత్కంఠతను రేపుతోంది. జవాన్ మూవీ కోసం దీపిక మేడమ్ తో కలిసి పనిచేశాను… అదొక అద్భుతమైన అనుభవం. ఆమె నటనకు సంబంధించిన పరిధి, శక్తి ప్రతి ఫ్రేమ్ లో చూపిస్తూ అందరినీ తన వైపుకు తిప్పుకునే గ్రేస్ ఆమెకు ఉంది అని కొనియాడారు అట్లీ. మరచిపోలేని ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ ఇందులో సృష్టించబోతున్నాం అన్నారు.

Also Read:టాలీవుడ్ సమస్యలపై అంతర్గత కమిటీ

- Advertisement -