ఆర్జీవీ చెంప చెల్లుమనిపించిన బిగ్ బాస్ బ్యూటీ..

216
- Advertisement -

రాంగోపాల్ వర్మ ఇయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలకు అడ్రస్‌గా మారుతుంది.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలవటం ఆయనకు తెలిసినంత బాగా సినిమా ఇండస్ట్రీలో మరెవరికి తెలీదు. వర్మ ఏది చేసినా సంచలనమే.. ఈ మధ్యనే బిగ్ బాస్ బ్యూటీ, నటి ఆషూరెడ్డితో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూకు సంబంధించిన కొంత ఫీడ్ ను జనాల మీదకు వదిలి.. దాని గురించి అంతా మాట్లాడుకునేలా చేయటం తెలిసిందే. కేఫ్ కమ్ ఐస్ క్రీం పార్లర్‌లో పొట్టి డ్రెస్సులో కూర్చున్న ఆషు రెడ్డిని కుర్చీ కిందకు వంగి.. తన సెల్ ఫోన్ తో ఆమె తొడల్ని ఫోటోలు తీసిన క్లిప్‌ను విడుదల చేసి.. మరో బోల్డ్ ఇంటర్వ్యూ అంటూ హడావుడి చేశారు.. అది కాస్తా పెద్ద ఎత్తున మీడియాలో రావటం తెలిసిందే. అయితే తాజాగా పవన్ పుట్టిన రోజు సందర్భంగా సదరు బోల్డ్ ఇంటర్వ్యూకు సంబంధించిన 1.32 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ టీజ‌ర్‌లో ఆషు రెడ్డి ఒక కాఫీ షాపులో కూర్చొని ఉండ‌గా.. రామ్ గోపాల్ వ‌ర్మ కూడా అదే కాఫీ షాపులోకి వెళ్తాడు. అక్క‌డ‌కు వెళ్లి ఆషు రెడ్డి ప‌క్క‌న కూర్చొంటాడు. ఆషు రెడ్డిని ప‌ల‌క‌రిస్తాడు. కానీ ఆషురెడ్డి ఆర్జీవీని గుర్తు ప‌ట్ట‌న‌ట్టుగా మాట్లాడుతుంది. ఇంత‌లో ఆషు రెడ్డిపై త‌న‌దైన శైలిలో రామ్ గోపాల్ వ‌ర్మ కామెంట్ చేస్తాడు. దీంతో కోపంతో ఆర్జీవీ చెంపపై ఒక్క‌టి ఇస్తుంది. అక్క‌డితో వీడియో అయిపోతుంది. ఆషు రెడ్డి నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గిఫ్ట్‌ అంటూ ఈ వీడియో ముగుస్తుంది. ఆర్జీవీ ట్వీట్ చేసిన ఈ ప్రోమో ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -