రూమర్లకు చెక్‌..వెనక్కి తగ్గేదిలేదు..!

284
actress anjali
- Advertisement -

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర లేని హీరోయిన్‌ అంజలి. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గీతాంజలి సినిమాలతో మంచి హిట్ సాధించిన ఈ అమ్మడు తర్వాత తెలుగు తెరకు దూరమైపోయింది. కోలీవుడ్‌లో తరమణి, పేరన్బు తదితర చిత్రాల్లో నటించారు.

నిజజీవితానికి దగ్గరగా సహజమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అంజలికి ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీగా ఉంది. త్వరలో ఓ తమిళ హీరోని పెళ్లాడనున్నాడని,పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి.

అయితే ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చింది అంజలి. ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచనలో లేను. ఒకవేళ వెంటనే పెళ్లి అయినా నటనను మాత్రం కొనసాగిస్తానని తెలిపారు. పెళ్లి తర్వాత పరిశ్రమకు దూరమైన హీరోయిన్లంతా మళ్లీ నటించడానికి వస్తున్నప్పుడు తానెందుకు ఇంట్లో కూర్చోవాలంటోంది అంజలి.

- Advertisement -