ప్చ్.. తమిళ డైరెక్టర్లు బాగా వేధించారట

62
- Advertisement -

త్రిష వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది. ఈ మధ్యలో క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ సీనియర్ నటి ఆమని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ ఇండస్ట్రీలో తాను క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ.. ”సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కొందరు తమిళ డైరెక్టర్లు ఒంటరిగా రమ్మని పిలిచేవారు. వెళ్లకపోతే తమ సినిమాల్లో అవకాశం ఇచ్చేవారు కాదు. ఇది ఏదో కొత్త దర్శకులు ఇలా చేశారు అనుకునేరు. గొప్ప పేరు ఉన్న దర్శకులే ఇలా చేసేవాళ్ళు’ అని ఆమని చెప్పింది.

అలాగే ఆమని ఇంకా మాట్లాడుతూ.. ఈ రోజుల్లో చాలా నయం. కానీ మా రోజుల్లో సినిమాల్లోకి వచ్చిన ఆడవాళ్ళు అంటే.. ఓ చులకన. నటీమణులు అంటే వారికి ఓ ఆటబొమ్మ. కానీ, వారికి ఫ్యామిలీస్ ఉంటాయని, వారికి కూడా బాధలు, భయాలు ఉంటాయని ఇక్కడ ఎవరూ అనుకోరు. అసలు సినిమా ఆడవాళ్ళకు జీవితాలు ఉంటాయని కూడా కొందరు నమ్మరు. వాళ్ళు పిలిస్తే వెళ్లిపోవాలి. పడకగదిలో వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. అందుకే, మా రోజుల్లో మేం ఎన్నో ఇబ్బందులు పడ్డాం’ అని ఆమని చెప్పింది.

త్రిష పై కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన కామెంట్స్ పై కూడా ఆమని మాట్లాడుతూ.. ‘త్రిషపై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కానీ ఈ కామెంట్స్ వెనుక కొన్ని నిజాలు ఉన్నాయి. మా టైమ్ లో హీరోయిన్ పై విలన్ చేత ఓ రేప్ సీన్ ను కచ్చితంగా సినిమాల్లో పెట్టేవారు. ఆ సీన్ లో విలన్లు హీరోయిన్ల పై పడి నలిపేసే వాళ్ళు. నటుడు మన్సూర్ అలీఖాన్ కూడా ఇలాంటి సీన్స్ లో ఎన్నో నటించాడు. బహుశా అతను ఆ ఉద్దేశ్యంతో చెప్పి ఉండొచ్చు అని ఆమని కీలక వ్యాఖ్యలు చేసింది.

Also Read:మరో రెండేళ్లు కెప్టెన్ గా రోహిత్ శర్మ?

- Advertisement -