- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్ లో మొక్కలు నాటారు సినీనటుడు యువరాజ్ రేజేటి..
ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.మనకు ఆక్సిజన్ లభించాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటాలని కోరారు.ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం నటి చైతన్య హెబ్సిబా,నటుడు రాజు రావణ్, డైరెక్టర్ సుదర్శన్ సైలేంద్ర ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ ఇచ్చారు యువరాజ్….
- Advertisement -