- Advertisement -
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్‌పై చెన్నై పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేశారు. ఆదివారం తెల్లవారుజామున ధృవ్ నడుపుతున్న కారు రోడ్డుపై నిలిపి ఉన్న మూడు ఆటోలపైకి దూసుకెళ్ళింది. ఈఘటనలో ఒక ఆటోడ్రైవర్ కాలు విరిగిందని, డ్రైవర్ల ఫిర్యాదుతో ధృవ్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
తెలుగులో సూపర్‌హిట్ అయిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా తమిళ రీమేక్‌తో ధ్రువ్ కోలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ‘వర్మ’గా ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్తూ ధ్రువ్ ఈ మేరకు బీభత్సం సృష్టించినట్టు తెలుస్తోంది. కారు బ్రేకులు ఫెయిలవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు.
- Advertisement -