గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న నటుడు తనుజ్..

85
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సినీ నటుడు తనుజ్ జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్‌లో మొక్కలు నాటారు.. ఈ సందర్భంగా తనుజ్ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉందని అన్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.

ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ద్వారా ప్రకృతి పట్ల బాధ్యతను గుర్తు చేసారని అన్నారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు తమ ఇంటి వద్ద వీలైనన్నీ మొక్కలు నాటాలని కోరారు. అనంతరం హీరోయిన్ నైనా గంగూలీ, నిర్మాతలు తేజ ఉప్పలపాటి,రాజేందర్ రెడ్డి ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

- Advertisement -