బాలీవుడ్ ప్రముఖ హీరో సన్నీడియోల్ బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ నుంచి సన్నీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే బీజేపీ చీఫ్ అమిత్ షా హీరో సన్నీడియోల్‌ను కలిశారు. పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌తో బీజేపీ పొత్తు పెట్టుకున్నది. 13 లోక్‌సభ స్థానాలకు .. బీజేపీ మూడింటిలో పోటీ చేస్తున్నది. అమృత్‌సర్, గురుదాస్‌పుర్, హోషియార్‌పుర్ నుంచి బీజేపీ పోటీ చేయనున్నది.
ఈ స్థానాల్లో అమృత్‌సర్ ఒకటి కాగా, ఇక్కడి నుంచి ఎవరైనా ప్రముఖ వ్యక్తిని బరిలోకి దింపాలని అధిష్ఠానం యోచిస్తోంది. ఇందుకోసం టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్, పూనం ధిల్లాన్, రాజేందర్ మోహన్ సింగ్ లాంటి ప్రముఖుల పేర్లను పరిశీలించారు. అయితే, చివరికి సన్నీడియోల్ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.
గదార్ ఏక్ ప్రేమ్ కథా, హిమ్మత్, గాతక్, బోర్డర్ లాంటి హిట్ చిత్రాల్లో సన్నీడియోల్ నటించారు. సన్నీడియోల్ తండ్రి ధర్మేంద్ర కూడా బీజేపీ నుంచి గతంలో పోటీ చేశారు. ఆయన బికనీర్ నుంచి పోటీ చేసి గెలిచారు. ధర్మేంద్ర భార్య హేమామాలిని యూపీలోని మథుర నుంచి పోటీలో ఉన్నారు.
Sunny Deol after joining BJP: The way my Papa worked with and supported Atal ji, I am here today to work with and support Modi ji. My work will do the talking. pic.twitter.com/JyAKFcG4Rn
— ANI (@ANI) April 23, 2019