నేను మంత్రి కేటీఆర్‌కు అభిమానిని:సుధీర్ బాబు

74
ktr
- Advertisement -

మంత్రి కేటీఆర్‌ తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు సినీ నటుడు సుధీర్ బాబు. హైదరాబాద్ లో జరిగిన ఇండియా జాయ్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌తో పాటు హీరో సుధీర్‌బాబు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సుధీర్‌బాబు..మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మంత్రి కేటీఆర్‌కు నేను అభిమానిని. ఆయనలో మంచి రాజకీయ నాయకుడితో పాటు నటుడు కూడా ఉన్నారన్నారు. భవిష్యత్తులో రాజకీయ నాయకుడి పాత్ర చేయాల్సి వస్తే కేటీఆర్‌నే అనుకరిస్తా.. కేటీఆర్‌ సినిమాల్లోకి రానందుకు ఆనందంగా ఉంది అని అనగా దీనిపై స్పందించిన కేటీఆర్.. ఇది కాంప్లిమెంట్ ఎలా అవుతుంది అని చమత్కరించారు.

తాను పాజిటివ్‌ దృక్పథంతోనే చేస్తున్నానని, మంచి రాజకీయ నాయకుడిలో మంచి యాక్టర్‌ ఉంటారని పేర్కొన్నారు. రాజకీయ నాయకుకు కూడా ప్రజాసేవ చేయాలంటే.. తన గురించి, కుటుంబం గురించి మరిచి పోయి పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.సుధీర్.. నీ మాటలు గుర్తుపెట్టుకుంటా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సుధీర్ చేసిన వ్యాఖ్యలను తాను పాజిటివ్‌గానే తీసుకుంటున్నానని చెబుతూ ఆయనకి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -