ఎస్‌ఎస్‌ఎంబీ 28లో అందాల రాక్షసి!

119
mahesh
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్‌లో ఇది 28వ సినిమా కాగా ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా పూజా హెగ్డేను తీసుకున్నారు. ఇక రెండో హీరోయిన్‌గా అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిని తీసుకున్నారట. కథలో సెకండ్ హీరోయిన్ కు కూడా మంచి ప్రాధాన్యత ఉండడంతో లావణ్య త్రిపాఠిని ఎంపిక చేశారట మేకర్స్.

ఈ వార్తలు గనుక నిజమైతే లావణ్య త్రిపాఠి, మహేష్ బాబు కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. అందం, అభినయం ఉన్నప్పటికి లావణ్యకు ఇప్పటి వరకూ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం రాలేదు.

ఇక ప్రస్తుతం మహేష్ నటించిన సర్కార్ వారి పాట రిలీజ్‌కు సిద్ధంగా త్రివిక్రమ్‌తో సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.

- Advertisement -