శివాజీరాజాకు గుండెపోటు..ఆస్పత్రిలో చేరిక

337
shivaji raja
- Advertisement -

మా మాజీ అధ్యక్షుడు శివాజీరాజా గుండెపోటుకు గురయ్యారు. లాక్ డౌన్‌తో కొద్దికాలంగా హైదరాబాద్ శివార్లలోని తన వ్యవసాయ క్షేత్రంలో పనుల్లో నిమగ్నమయ్యారు. సినీ కార్మికుల కోసం తన వ్యవసాయ క్షేత్రంలో పండిన కూరగాయలతో పాటు నిత్యావసర సరుకులను అందచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు శివాజీరాజా . వెంట‌నే ఆయన్ని కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి త‌రలించారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కి చికిత్స కొన‌సాగుతుండ‌గా, ఆరోగ్యం స్థిరంగానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. బీపీ ఒక్క‌సారిగా డౌన్ కావ‌డంతో ఆయ‌న‌కి హార్ట్ ఎటాక్ వ‌చ్చింద‌ని, శ‌స్త్ర చికిత్స చేసి స్టంట్ వేసే అవ‌కాశం ఉంద‌ని వెద్యులు పేర్కొన్నట్టు సురేష్ కొండేటి తెలిపారు.

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివాజీరాజా అందరితో కలిసిమెలిసి ఉంటారు. సేవా కార్యక్రమాలకు కేరాఫ్‌గా మారారు. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.

- Advertisement -