నటుడు శరత్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌..

207
Actor Sarath Kumar
- Advertisement -

కరోనా మహమ్మారితో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రి పాలైయ్యారు. అందులో కొందరు కోలుకోగా మరి కొందరు మరణించారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ కూడా కరోనా వ్యాధికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన భార్య, సినీ నటి రాధిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. హైదరాబాదులో ఉన్న శరత్ కు కరోనా సోకింది. టెస్టు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. శరత్ కు అసింప్టొమేటిక్ లక్షణాలు వచ్చాయి. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను అందిస్తుంటానని రాధికా పేర్కొన్నారు.

- Advertisement -