సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం!

117
salman
- Advertisement -

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. సల్మాన్‌ను చంపేస్తామని ఈ బెదిరింపు లేఖలో పేర్కొన్నారు. సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీంఖాన్‌ ఉదయం జాగింగ్‌కు వెళ్లినప్పుడు ఈ బెదిరింపు లేఖ కనిపించింది. పంజాబీ సింగర్‌ సిద్ధూ మూస్ వాలా లాగే సల్మాన్‌ను కూడా హతమారుస్తామని అగంతకులు ఈ లేఖలో పేర్కొన్నారు.

దీనిపై సల్మాన్ ఖాన్‌ బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ అంశంపై దర్యాపు చేపట్టారు. దీంతో సల్మాన్ ఖాన్ కు ముంబై పోలీసులు భద్రతను పెంచారు. గతంలో గ్యాంగ్‌స్టార్‌ లారెన్స్‌ బిష్టోయ్‌ సల్మాన్ ను హత్య చేస్తానని బెదిరించాడు. 2020లో జరిగిన ఒక హత్య కేసులో బిష్ణోయ్ సహచరుడు రాహుల్ అలియాస్ సన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారిస్తున్న సమయంలో సల్మాన్ ను చంపబోతున్నామరి పోలీసులకు తెలిపాడు. దీంతో సల్మాన్‌ భద్రతను కట్టుదిట్టం చేశారు.

- Advertisement -