శ్రీనగర్ వేదికగా జరుగుతున్న టూరిజం వర్కింగ్ గ్రూప్‌కు టాలీవుడ్ మెగా హీరో రామ్‌చరణ్ హాజరయ్యారు. జమ్ముకశ్మీర్ వేదికగా జరుగుతున్న జీ-20 సదస్సులో ఆయన పాల్గొన్నారు. పలు దేశాలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అలాగే త్వరలో హాలీవుడ్‌లో కూడా సినిమాలో నటిస్తున్నట్టు హింట్ ఇచ్చారు. 2016లో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ జరిగిందని చెప్పుకొచ్చారు. అనంతరం భారత్‌కు దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జె.బోక్‌తో కలిసి రామ్‌చరణ్ నాటు నాటు పాటకు స్టేప్పులేసి ఆలరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పలు ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారింది.
ఆర్టికల్ 370ను తొలగించిన తర్వాత అక్కడి పరిస్థితులు గణనీయంగా మెరుగుపడిందని ప్రపంచానికి చాటేందుకు పూర్వ పర్యాటక వైభవ పునరుద్ధరణకు ఇక్కడ సదస్సు నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రఖ్యాతి దాల్ సరస్సున ఉన్న షేర్ ఏ కశ్మీర్ ఇంటర్‌నేషనల్ కాన్ఫరెన్స్‌లో హాల్ ఈమీటింగ్ జరుగుతుంది. మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్‌చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.
Also Read: రీ-రిలీజ్‌కు సిద్ధమైన కౌబాయ్ మూవీ…
Actor @AlwaysRamCharan dances to the tunes of 'Naatu Naatu' with Korean ambassador during G20 meeting#NaatuNaatu #G20Kashmir #G20InKashmir pic.twitter.com/yzPU6fTGNo
— Parul Sabherwal (@parulsabherwal) May 22, 2023