మొక్కలు నాటిన సినీ నటుడు రాజ్‌కుమార్..

147
gic
- Advertisement -

రాజ్య సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు సినీ నటుడు రాజ్ కుమార్. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ గ్రీన్ఇండియా చాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమం అని కొనియాడారు.ఇంత మంచి కార్యక్రమం లో పాల్గొన్నందుకు అదృష్టంగా బావిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం ఎంతో ఇన్స్పైర్ చేసిందని గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టి దీన్నొక యజ్ఞం లా ముందుకు తీసుకువెళుతున్న ఎంపీ సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.నా వంతుగా వీలైనంత ఎక్కువ మందిని బాగస్వామ్యం చేస్తూ దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని రాజ్ కుమార్ తెలిపారు…

- Advertisement -