గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన రాజీవ్ కనకాల..

347
Rajiv Kanakala

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పోందుతోంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన తెలుగు సినీ నటుడు రాజీవ్ కనకాల ఈ రోజు తన ఇంటి ఆవరణలో మూడు మొక్కలను నాటారు.

Actor rajiv kanakalaఈ సందర్భంగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని అదేవిధంగా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని రాజీవ్‌ తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అని అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం చాలా సంతోషకరమని అన్నారు.

rajiv

ఈ సందర్భంగా సంతోష్‌కి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే నీను మరొక ముగ్గుర్ని మొక్కలు నాటాలని ఛాలెంజ్ చేసి వారితో తప్పకుండా మొక్కలు నాటిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధుల రాఘవ, కిషోర్ గౌడ్, సినీ నటులు కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.