ఘనంగా సిరివెన్నెల తనయుడి పెళ్లి..

274
Actor Raja Chembolu
- Advertisement -

ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు రాజా వివాహం హైదరాబాదులో ఘనంగా జరిగింది. రాజా, హిమబిందుల వివాహ వేడుకకు నగరంలోని దసపల్లా హోటల్ వేదికగా నిలిచింది. ఈ వివాహానికి టాలీవుడ్ ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లిలో సిరివెన్నెల బంధువు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సందడి చేశారు.

దర్శకులు క్రిష్, కృష్ణవంశీ, గుణ్ణం గంగరాజు, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, డైలాగ్ రైటర్ బుర్రా సాయిమాధవ్ తదితరులు ఈ వివాహానికి విచ్చేశారు. సిరివెన్నెల తనయుడు రాజా తండ్రి బాటలో కాకుండా నటన రంగంలో తన ప్రతిభను చాటుకుంటున్నాడు. ఫిదా, అజ్ఞాతవాసి, మిస్టర్ మజ్ను, రణరంగం, హ్యాపీ వెడ్డింగ్, నా పేరు సూర్య వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రాజా, హిమబిందు నిశ్చితార్థం ఆగస్టులో జరిగింది.

- Advertisement -