ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)ని సినీ నిర్మాత,దర్శకుడు, నటుడు ఆర్. నారాయణమూర్తి గురువారం భేటీ అయ్యారు.. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా పరిశ్రమ మనుగడను కాపాడటం కోసం, అస్తిత్వం నిలబడటం కోసం ది బెస్ట్ చేయండని దాంతో పాటు నా విజ్ఞప్తిని సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలిచేయలని మంత్రిని కోరటం జరిగిందన్నారు.
ఇందుకు మంత్రి పేర్ని నాని 100 శాతం సానుకూలంగా స్పందించారు.పెద్ద బడ్జెట్ సినిమాలకు ఎంత కావాలంటే అంత టికెట్ రేటు పెంచుకోవడాన్ని మొదట్నుంచీ వ్యతీరేకిస్తున్నాం. అది పూర్తి స్థాయిలో బ్లాక్ మార్కెటింగ్ ఔతుంది దాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద బడ్జెట్ సినిమాల టిక్కెట్, బెనిఫిట్ షో విషయంలో సగటు ప్రేక్షకుడిని, సగటు మనిషిని దృష్టిలో ఉంచుకుని అందరూ బాగుండే విధంగా టికెట్ రేటు నిర్ణయించే దశలో ది బెస్ట్ చేయండని సీఎం జగన్ మోహన్ రెడ్డిని, మంత్రి పేర్ని నానిని కోరటం జరిగింది.
సొంత ఇగొలకి, ఫీలింగ్స్ కు సినిమా పరిశ్రమతో ముడి పెట్టకూడదు.. సినిమా పరిశ్రమ అందరిదీ. పరిశ్రమ పెద్దలు పాజిటివ్ ఆటిట్యూడ్‌తో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి సమస్య పరిష్కరించుకోవాలి. అలాగే సీఎం కూడా సినిమా పరిశ్రమ, ప్రజలను ఖుషి చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆర్. నారాయణమూర్తి తెలిపారు.