మైనర్ బాలికపై అత్యాచారం.. నిందుతుడి అరెస్టు..

32

మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన కేసులో నిందితుడు కూడా మైనరేనని శంషాబాద్ డీసీపీ జగదీశ్వరరెడ్డి వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు కర్ణాటక వాసి.. బాధితురాలికి నిందితుడు ముందు నుంచే తెలుసు.. ఆ అమ్మాయి పట్ల చాలా కాలం నుంచి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెట్టాడన్నారు. 28వ తేదీన బాలికకు గుడికి వెళదాం అని చెప్పి.. కొత్వాల్‌లో ఉన్న పొదలలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్నారు. పిల్లర్ నంబర్ 118 వద్ద నిందుతుడిని అరెస్ట్ చేశామని.. నేడు రిమాండ్‌కి తరలిస్తామని జగదీశ్వరరెడ్డి వెల్లడించారు.