వైసీపీకే ప్రజల మద్దతు: పృధ్విరాజ్

24
pridviraj

రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సంతోషంగా సంపూర్ణంగా ప్రశాంతంగా కొనసాగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు ప్రముఖ సినీ నటుడు పృద్వి రాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు వైఎస్సార్ జిల్లా కడప నగరంలో ప్రసిద్ధి చెందిన అమీన్ పీర్ దర్గా పెద్ద దర్గా లో ప్రముఖ సినీ నటుడు పృద్వి రాజ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కడప నగరంలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు కడపకు విచ్చేసిన పృథ్వి రాజ్ పెద్ద దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా వద్దకు చేరుకున్న ఆయనకు దర్గా ప్రతినిధులు స్వాగతం పలికారు .

అనంతరం దర్గాలోని మాజర్ల వద్ద పూల చదార్లను ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తూ కడప దర్గా కు పలు మార్లు రావడం జరిగిందని, దర్గాలో ప్రార్థనలు చేసిన సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సినిమా టికెట్ల విషయమై స్పందిస్తూ తాను సామాన్య ప్రేక్షకుడిని పేర్కొన్నారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ స్థానం ఎన్ని సమస్యలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నా అని పేర్కొన్నారు.