దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే నటుడు ప్రకాశ్‌రాజ్. తాజాగా తెలంగాణ బీజేపీ చేసిన వ్యవహరంపై స్పందించాడు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్రంలో అలజడి సృష్టించడమే బీజేపీకి పని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను తప్పించి అధికారంలోకి వస్తున్నారని మండిపడ్డారు.
కర్ణాటక, మహారాష్ట్ర ఇప్పుడు తెలంగాణలోను అదే పని చేస్తున్నారన్నారు. ఆ దొంగలకు వేరే పని తెలీదు. ఇలాంటి పని చేస్తున్నప్పుడు ప్రజలు, మీడియా ప్రశ్నించాలి అంటూ ఓ నటుడిగా తన అభిప్రాయాన్ని మీడియా ముందు వ్యక్తపరిచాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ప్రకాశ్ రాజ్ అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌ల ఆలోచనలు తనకు ఇష్టమని.. వారు తనను ఎంతో గౌరవిస్తారని చెప్పారు. కేసీఆర్ కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్‌గా ఉంటారని.. ప్రస్తుత పరిస్థితుల్లో అలా ఉండక తప్పదన్నారు. అయితే, ఆయన వైఖరి కొందరికి నచ్చలేదని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఆయన్ని అర్థం చేసుకొని కేసీఆర్ వెంట ఉంటారని ప్రకాశ్ రాజ్ అన్నారు.
ఇవి కూడా చదవండి..