ఫస్టులుక్: ఒంటికాలుతో ప్రభుదేవా పోరాటం..

107
- Advertisement -

ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా డాన్స్‌తోనే కాకుండా నటుడిగా, దర్శకుడిగా కూడా ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా కోలీవుడ్‌లో ‘పోయిక్కల్ కుతిరాయ్’ అనే విభిన్నమైన చిత్రంలో నటిస్తున్నాడు. సంతోష్ జయకుమార్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.కెరియర్ పరంగా ప్రభుదేవాకి ఇది 54వ సినిమా. రైజా విల్సన్ కథానాయికగా నటిస్తున్నది. ఇక ఈ సినిమాలో, వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ముఖ్యమైన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ – సముద్రఖని కనిపించనున్నారు.

ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను, తమిళంతో పాటు తెలుగులోను డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభుదేవా కృత్రిమ కాలుతో కనిపిస్తున్నాడు. ఒక చేత్తో ఒక పాపను ఎత్తుకుని ఉన్న ఆయన, మరో చేత్తో ఒక ఇనుప ఆయుధాన్ని పట్టుకుని ఉన్నాడు. శత్రువుల బారి నుంచి ఆ పాపను కాపాడే ప్రయత్నంలో ఆయన ఉన్నాడనే విషయం అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చెన్నైలో జరుగుతోంది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణను పూర్తిచేశారు.

- Advertisement -