హీరో నితిన్ పెళ్లి వాయిదా!

646
Nithin wife
- Advertisement -

యంగ్ హీరో నితిన్ తన ఫ్రెండ్ షాలినిని పెళ్లి చేసుకోనున్నాడు. ఇటివలే వీరిద్దరికి నిశ్చితార్ధం కూడా జరిగింది. ఏప్రిల్ 15న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని దుబాయ్‌లోని వెర్సేస్ పాలాజ్జో లగ్జరీ హోటల్‌ను కూడా బుక్ చేసుకున్నాడు. ఇద్దరి కుటుంబ సభ్యులు ఇప్పటికే దుబాయ్ కి వెళ్లి పెళ్లి పనులు చూసుకుంటున్నారు.

తాజాగా ఉన్న సమాచారం మేరకు అనుకోకుండా నితిన్, షాలినిల పెళ్లి వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో వీరి పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైతే నితిన్ పెళ్లి వాయిదా పడిందా లేదా అనేది స్పష్టంగా తెలియదు. కానీ.. దుబాయ్‌లో కూడా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో పెళ్లిని హైదరాబాద్‌లో నిర్వహించడానికి ఆయన కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. నితిన్ ప్రస్తుతం రంగ్ దే మూవీ నటిస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

- Advertisement -