మొక్కలు నాటిన నటుడు నవీన్ విజయ్ కృష్ణ..

37
harsha

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నానక్ రామ్ గూడ లోని తన నివాసం లో మొక్కలు నాటారు నటుడు నవీన్ విజయ్ క్రిష్ణ.అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని నటుడు నవీన్ విజయ్ క్రిష్ణ అన్నారు.

చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకడిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. నటుడు హర్ష విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ నానక్ రామ్ గూడ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటిండ్రు.అనంతరం మరో ముగ్గురు ( హీరో లు సుధీర్ బాబు , మంచు మనోజ్ , మ్యూజిక్ డైరెక్టర్ అంచు రాజమని )లు కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని నటుడు వినయ్ విజయ్ క్రిష్ణ పిలుపునిచ్చారు.