- Advertisement -
ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మా మాజీ అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్. ఎందుకు ఏడుస్తున్నారు ? మగవాళ్ళు కూడా ఈరోజు ము***ల్లా ఏడుస్తున్నారు.. ఏడ్చే మగాళ్లను నమ్మొద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం చేయగా ఈ సందర్భంగా మాట్లాడిన నరేష్.. కలిసి పనిచేస్తాం అన్న వాళ్ళు ఎందుకు రిజైన్ చేశారు. బయట ఉండి ప్రశ్నించడం ఏంటి…? మోడీ గెలిచాడు అని… కాంగ్రెస్ వాళ్లు దేశం వదిలి వెళ్ళలేదు కదా..! అని చురకలు అంటించారు.
‘మా’ అనేది కుటుంబం. గెస్ట్ గా వచ్చిన వాళ్లే ఇది కుటుంబం కాదు అంటారు. ఫ్యాక్షనిజం మానేద్దాం కలిసి పనిచేద్దాం. ప్రమాణ స్వీకారం త్వరలో ప్రకటిస్తాం అన్నారు. ఎమోషన్స్, ఫ్రస్ట్రేషన్ వద్దు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ గెలిచాక కూడా ఆరోపణలు చేయడం ఏంటి? అంటి చురకలు అంటించారు.
- Advertisement -