మూడు ముళ్లతో ఒక్కటైన నరేష్-పవిత్ర

17
- Advertisement -

సీనియర్ నటుడు నరేష్ , నటి పవిత్ర లోకేష్ మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. ఇది వరకే తామిద్దరం సహజీవనం చేస్తున్నామని ప్రకటించుకున్నారు. కృష్ణ గారు చనిపోయినప్పుడు ఇద్దరూ బాగా హైలైట్ అయ్యారు. ఆ తర్వాత పవిత్రతో లిప్ లాక్ వీడియో రిలీజ్ చేసి నరేష్ త్వరలోనే తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ప్రకటించాడు. ఆ లిప్ లాక్ వీడియో బాగా వైరల్ అయింది.

తాజాగా పవిత్ర మెడలో మూడు ముల్లు వేసి భార్య బంధంతో ఇద్దరం కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నామని చెప్తూ దానికి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతూ తమ పెళ్లి వీడియో రిలీజ్ చేశాడు నరేష్. ప్రస్తుతం నరేష్ పవిత్ర పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరి పెళ్లి కి పలువురు శుభాకాంక్షలు చెప్తుంటే సింగిల్స్ మాత్రం నరేష్ నాలోగో పెళ్లి పై కామెంట్స్ చేస్తున్నారు. ఎట్టకేలకు వీకే నరేష్ పవిత్రతో సహజీవనానికి ఫులి స్టాప్ పెట్టేసి భర్తగా మారాడని మాట్లాడుకుంటున్నారు.

పవిత్రను నరేష్ నిజంగానే పెళ్లి చేసుకున్నాడా ? లేదా నరేష్ ఏమైనా సినిమాకు సంబంధించి పబ్లిసిటీ స్టంటా ? తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -