టైటిల్ ఉంటే నిజమవుతుందా..కమల్‌ హసన్‌

34
- Advertisement -

విడుదలకు ముందు నుంచే వివాదాల్లో చిక్కుకున్న సినిమా ది కేరళ స్టోరీ. తాజాగా లోకనాయకుడు కమల్‌ హసన్‌ ఈ సినిమాపై సంచలనమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నేను ఎప్పుడూ ఒకే మాట చెబుతాను. నాకు ప్రచార సినిమాలు నచ్చవు. అలాంటి వాటికి నేను పూర్తి వ్యతిరేకిని కాని సినిమా టైటిల్‌ కింద నిజమైన కథ అని రాయగానే సరిపోదు. అలా రాసినంత మాత్రన అది నిజంగా జరిగిన కథ కాదు అని కమల్‌ హసన్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రేక్షకుల నుంచి భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే విషయంపై దర్శకుడు సుధీప్త్‌ సేన్ స్పందిస్తూ…నేను గతంలో అయితే స్పందించేవాడిని కానీ ఇప్పడు అలాంటి వ్యాఖ్యలకు నేను స్పందించను ఎందుకంటే ప్రేక్షకులు చూసి అసత్య ప్రచారం అని అనుకోవడం లేదు కదా..అలాగే రెండు రాష్ట్రాలు ఆ సినిమాను చూసి ఉంటే బాగుండేది. కానీ వాళ్లు స్టీరియోటైప్‌లో ఉండిపోయారు అని అన్నారు. ప్రస్తుతం ఆయన్ని ఆరోగ్యం కుదుటపడుతుందని డాక్టర్లు తెలిపారు. ఇంకా డీహైడ్రేషన్ ప్రాబ్లమ్‌ ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా విడుదల చేసిన కొన్ని రాష్ట్రాల్లో దీనిపై నిషేదం విధించారు. అయిన బాక్సాఫీస్ వద్ద రికార్డుల కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా రూ.200కోట్లకు పైగా వసూళ్లు చేసింది.

Also Read: హీరో శర్వానంద్ కు గాయాలు…

- Advertisement -