టాలీవుడ్ లో గత కొద్ది రోజులు క్రితం క్యాస్టింగ్ కౌచ్ పై రచ్చ జరిగిన విషయం తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయగా..ఆమె చేసిన వ్యాఖ్యలను కొంతమంది ఖండించగా మరికొంత మంది విమర్శించారు. శ్రీరెడ్డికి మద్దతుగా చాలా మంది ఆర్టిస్టులు తెరపైకి వచ్చి తమ గోడును వెల్లబోసుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా సైలెంట్ అయిన శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ లో పలువురిపై కామెంట్లు పెడుతుంది. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, నానిలపై పలు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
అయితే శ్రీరెడ్డి తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. తన ఫేస్ బుక్ లో పలువరిపై పోస్టులు పెడుతూ సంచలనం సృష్టిస్తుంది. తాజాగా తమిళ డైరెక్టర్ మురుగదాస్ పై కామెంట్స్ చేయగా..డైరెక్టర్, హీరో, డ్యాన్సర్ రాఘవ లారెన్స్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. రాఘవ లారెన్స్ తో ఒకరోజు గోల్కొండ హోటల్ లో గడిపానని అతను తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. తనకు సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని మోసం చేశారని పేర్కొంది.
శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలపై స్పందించాలని డిమాండ్ చేశారు ప్రముఖ దర్శకుడు, నటుడు టీ రాజేందర్. శ్రీరెడ్డి ఎవరిమీదనయితే ఆరోపణలు చేసిందో వారు వివరణ ఇచ్చి ఇంతటితో ఈవిషయానికి ముగింపు పలికితే మంచిదన్నారు. క్యాస్టింగ్ కౌచ్ అనే అంశం ఇండస్ట్రీలో సమజమేనన్నారు. నేను నటించి దర్శకత్వం వహించిన సినిమాల్లో ఆడవాళ్లను టచ్ కూడా చేయలేదని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి బహిరంగ ఆరోపణలు చేసుకోవడం మంచికాదన్నారు. శ్రీరెడ్డి ఎవరిమీదనయితే ఆరోపణలు చేసిందొ వారు సమాధానం చెప్పి ముగింపు పలకాలన్నారు.