కమల్‌కు పోటీగా నయన్‌..!

191

నయనతార అటు గ్లామర్‌ పాత్రలతో ఇటు నటనకి అవకాశమున్న పాత్రలను ఎంచుకుంటు వరుస సినిమాలతో దూకుపోతుంది. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌కి ప్రాధాన్యతను ఇవ్వడం వల్లనే నయన్‌ స్టార్‌ హీరోయిన్‌ స్థానాన్ని సొంతం చేసుకోగలిగింది. అలాంటి నయనతార నటించిన తాజా చిత్రం ‘కొలమావు కోకిల’.

నయన్ ప్రధానపాత్రగా రూపొందించిన ఈ సినిమాలో డ్రగ్స్ అమ్మే యువతిగా ఆమే కనిపిస్తుంది. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాను ఆగస్టు 10వ తేదీన విడుదల చేయనున్నారు.

Nayanthara

ఇక అసలు విషయం ఏంటంటే అదే రోజున కమలహాసన్ ‘విశ్వరూపం 2’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల మద్య పోటీ నెలకొంది. తమిళనాట విశ్వనటుడు కమల్‌కి గల ఫ్యాన్‌ ఫాలోంగ్ తెలిసిందే. అయినా అదే రోజు నయన్‌ సినిమాను విడుదల చేయడం విశేషం.

భారీ బడ్జెట్‌తో ‘విశ్వరూపం 2’ సినిమా తెరకెక్కించారు. ఇక నయన్‌ నటించిన ‘కొలమావు కోకిల’ సినిమా తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించారు. కానీ ఈ సినిమాను నిర్మించింది మాత్రం పెద్ద నిర్మాణ సంస్థే. కాకపోతే ఈ సినిమా కథాకథనాల్లోని కొత్తదన ఉండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకే ‘విశ్వరూపం 2’ తో పోటీ పడటానికి కారణమని సమాచారం.