మలయాళ నటి భావనను కిడ్నాప్ చేసి.. కార్లో ఆమెపై జరిగిన లైంగిక వేధింపుల వెనకాల మళయాల నటుడు దిలీప్, ఆయన భార్య కావ్య మాధవన్ ఉన్నట్టు తెలిసింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ దురాగతానికి పాల్పడిన ప్రధాన నిందితుడు పల్సర్ సునితో పాటు మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేసి విచారించిన పోలీసులు… నిన్న నటుడు దిలీప్ ను అదుపులోకి తీసుకున్నారు.
భావనను లైంగికంగా వేధించిడానికి దిలీప్ వివాహం నాడే స్కెచ్ రెడీ అయిందని పోలీసులు గుర్తించారు. మొదటి భార్యకు విడాకులిచ్చిన దిలీప్‌ను 24 నవంబర్ 2016లో కావ్య మాధవన్ ను వివాహం చేసుకున్నాడు.. ఆ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన భావన…. దానికి హాజరు కాలేదు సరికదా, తీవ్ర వ్యాఖ్యలు చేసిందని వార్తలు వెలువడ్డాయి. దీంతో నొచ్చుకున్న దంపతులు భావనపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వెంటనే ప్రతీకారం తీర్చుకుంటే తామే చేశామన్న విషయం తెలిసిపోతుందని భావించిన దీలీప్.. సుదీర్ఘ కాలం వెయిట్ చేశారు. ఆ తరువాత ఒక కార్పొరేటర్ ను కిరాయికి మాట్లాడుకుని పల్సర్ సునీతో కథ నడిపించారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
పల్సర్ సుని గ్యాంగ్ తనను కిడ్నాప్ చేసి కార్లో తనను వేధిస్తున్న సమయంలో క్రమం తప్పకుండా సునికి ఫోన్ కాల్స్ వచ్చాయని.. అతడికి ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ ఈ వ్యవహారాన్ని నడిపించింది ఒక మహిళ అని భావన వెల్లడించిన సంగతి తెలిసిందే. సుని మాటల్ని బట్టి అవతల ఉన్నది ఒక లేడీ అన్న విషయం స్పష్టంగా తనకు అర్థమైందని భావన తెలిపింది. ఆ లేడీ దిలీప్ భార్య, నటి కావ్య మాధవన్ అని స్పష్టం కావడంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. హీరోయిన్‌పై వేధింపుల కేసు కావడంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఛాలెంజ్‌గా తీసుకున్న కేరళ పోలీసులు ఈ కేసులో ప్రత్యేక దృష్టి పెట్టడంతో నిజాలు భయటపడ్డాయి. మరీ భావన నుండి ఏవిధమైన రెస్పాన్స్ వస్తుందో చూడాలి..