శ్రీలీల అయితే ఒకే చెప్తా:బ్రహ్మాజీ

71
- Advertisement -

సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ రావు హీరోగా నటించిన చిత్రం ‘స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌’. ప్రణవి మానుకొండ కథానాయిక. ఈ నెల 29న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు నటుడు బ్రహ్మాజీ.

ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బ్రహ్మాజీ. మళ్లీ మీకు హీరోగా చేసే ఛాన్స్ వస్తే, హీరోయిన్ గా మీ పక్కన ఎవరు చేయాలనుకుంటారు? అని అడగ్గా శ్రీలీల అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. తను డాన్స్ చాలా బాగా చేస్తుంది .. నాకు రాదనీ అనుకుంటున్నారేమో .. నేను కూడా బాగానే చేస్తాను అని తెలిపారు.

Also Read:మోడీ సర్కార్‌పై అవిశ్వాసం..అనుమతిచ్చిన స్పీకర్

శ్రీలీల చాలా ఫాస్టుగా స్టార్ డమ్ ను అందుకుంది. ఆమె ఎనర్జీ లెవెల్స్ చూస్తుంటే, జయప్రద – శ్రీదేవి రేంజ్ కి వెళుతుందని అనిపిస్తుందన్నారు. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు ‘ ఓ పిట్టకథ’ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే.

- Advertisement -