టాలీవుడ్‌లో విషాదం..యువనటుడు మృతి

4
- Advertisement -

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. యువ నటుడు భరత్ కాంత్ మరియు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదివారం రాత్రి నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తుండగా, ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఎగ్జిట్ నంబర్ 12, బొంగులూరు గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుంచి అతివేగంతో వచ్చిన ఒక కంటైనర్ లారీ వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు నటుడు భరత్ కాంత్, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ అక్కడికక్కడే మృతి చెందారు.

ఇటీవలే విడుదలైన ‘టాలెంట్’ (Talent) అనే చిత్రంలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు భరత్ కాంత్. ఆయన తెలుగుతో పాటు హిందీ వెబ్ సిరీస్‌లలో కూడా నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు.

Also Read:ఓటీటీ ట్రెండింగ్‌లో ‘డెకాయిట్’

త్రిలోక్…పలు తెలుగు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఒకేసారి ఇద్దరు ప్రతిభావంతులైన యువకులను కోల్పోవడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -