తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కప్పుడు ఓ వెలుగు వెలిగిన నటులు చాలా మంది ఇప్పుడు కనుమరుగై పోయారు. మళ్లీ టాలీవుడులోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి జాబితాలో నటుడు బబ్లూ పృథ్విరాజ్ ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లడుతూ.. ఆసక్తికర విషయాలు చెప్పారు. నాకు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలిదన్నారు. ఏ పాత్ర ఇచ్చినా. ఒదిగి పోతానని.. పనిపై అంకితభావంతో పని చేస్తానని, అంతేకానీ ఎదుటివారిని డావినేట్ చెయ్యాలనే ఉద్దేశం ఏ మాత్రం లేదని చెప్పుకొచ్చారు.
తనకు ఓ షూటింగ్లో జరిగిన సంఘనను గుర్తు చేసుకున్నారు. ఒక రోజు వైజాగ్‌లో షూటింగ్ ఉండే.. నాలుగు పేజీల డైలాగ్‌ను నా చేతిలో పెట్టి, సింగిల్ టేక్ చెయ్యాలి అన్నారు. ఎందుకని అడగగా అది సన్ సెట్ నేపథ్యంలోని షూట్… లేకుంటే మళ్లీ రేపు ఇదే టైమ్ లో షూటింగ్ అన్నారు. వాళ్లు అన్నట్లుగానే సింగిల్ టేక్‌లో చేశాను. సూపర్ అంటూ అందరూ చప్పట్లు కొట్టి మెచ్చుకున్నారు. కానీ హీరోగారు మాత్రం చాలా ఫీలైపోయారు. తనను డామినేట్ చేస్తున్నానని అనుకుని ఫీలైపోయారు.
అంతే ఇక ఆ సీన్ సినిమాలో లేకుండా చేశారు. రిలీజ్ తర్వాత ఆ సీన్ కనిపించకపోవడంతో.. అంత గొప్ప సీన్ తీసేశారేంటయ్యా అని అడిగితే.. హీరోగారు తీసేయమన్నారు సార్ అంటూ చెప్పారు. ఇలాంటి సంఘటనలే చాలా మంది హీరోల విషయంలో జరిగాయని బబ్లూ పృథ్విరాజ్ చెప్పుకొచ్చారు.