లొంగిపోయిన అమలాపాల్..

204
AMALAPAL
- Advertisement -

ప్రముఖ నటి అమలాపాల్ తిరువనంతపురం క్రైమ్ బ్రాంచ్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఖరీదైన కారుని కొనుగోలు చేసిన ఈ అమ్మడు.. పుదుచ్చేరిలో నకిలీ ఆధారాలతో రిజిస్ట్రేషన్ చేయించిన విషయం వెలుగులోకి రావడంతో చిక్కుల్లో పడింది. ట్యాక్స్‌ నుంచి తప్పించుకునేందుకే ఈ విధంగా అమలాపాల్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.

amalapaul-

మరోవైపు స్వయంగా పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడి ఈ మోసాన్ని వెలుగులోకి తీసుకురావడంతో హుటాహుటీన కదలిన కేరళా పోలీసులు అమలాపాల్‌పై పన్ను ఎగవేత కేసుని నమోదు చేశారు. సెక్షన్ 430, 468, 471 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆమె ఇటీవల కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఈ కేసును తర్వాత పరిశీస్తామని చెప్పిన కోర్టు, అమలాపాల్‌ని వెంటనే క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

Amalapaul-

దీంతో ఆమె సోమవారం పోలీసుల ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. తాను అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి అడ్రస్‌తోనే కారు కొన్నానని ఆమె పోలీసులకు తెలిపారు. అవి తప్పుడు పత్రాలేనని పోలీసులు బలంగా నమ్ముతున్నారు.

- Advertisement -