దక్షిణ కొరియాలో మంత్రి కేటీఆర్ బృందం

220
ktr
- Advertisement -

రెండు రోజుల పాటు ద‌క్షిణ కొరియాలో పర్యటిస్తున్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బృందం పలు కంపెనీల సీఈవోలు, కంపెనీల ప్రతినిధుల సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. వివిధ కంపెనీలను కలిసిన మంత్రి బ..ందం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార, పెట్టుబడులు అవకాశాలను వివరించారు. ముఖ్యంగా ఆటోమోబైల్, టెక్స్ టైల్, ఫార్మ, ఐటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. దిగ్గజం హ్యూందాయ్ కార్పొరేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు నామ్ గుహ్నోత్ తో సమావేశమయ్యారు.

MOIBA - TS GOVT MOU

తెలంగాణలోని ఆటోమొబైల్ రంగంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ముఖ్యంగా టీయస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో అనుమతుల విధానం పైన హ్యుందయ్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. హ్యూందాయ్ రోటెమ్, గ్లోబల్ రైల్వే విభాగం డైరెక్టర్ కెకె యూన్ తో సమావేశం అయ్యారు. గ్రీన్ ఎనర్జీలో అగ్రగామిగా ఉన్న ఒసిఐ సీఈవో వ్యూయూన్ లీతో సమావేశం అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ కంపెనీనీ తెలంగాణకు ఆహ్వానించారు. మొబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోషియేషన్ తో మంత్రి ప్రతినిధి బృందం సమావేశం అయింది. మెయిబా సీఈవో ఛోయ్ డాంగ్ జిన్ తో జరిగిన సమావేశంలో సంస్థ ప్రతినిధులను ఫిబ్రవరిలో తెలంగాణలో జరగనున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ కు ఆహ్వానించారు. 500లకు పైగా కంపెనీలు సభ్యులుగా ఉన్న ఈ సంస్ధతో తెలంగాణ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందం మేరకు మొయిబా ఇంటర్నేట్ బిజినెస్ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ రియాలిటీ, మరియు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ వంటి అంశాల్లో కలిసి పనిచేస్తాయి.

daugu auto mobile meet

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, టెక్స్ టైల్ రంగంలోని పెట్టుబడులకు ఆకర్షనీయ ప్రదేశమని పెట్టుబడులతో ముందుకు వచ్చే కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాకారం అందిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, టీఎస్ ఐపాస్ వంటి అంశాలను మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ డైటెక్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం కొరియా టెక్స్ టైల్ సిటీగా పేరుగాంచిన దైగు మెట్రోపాలిటిన్ నగరాన్ని మంత్రి కేటీఆర్ బృందం సందర్శించింది. ఈ నగరంలో కొరియన్ టెక్స్ టైల్, ఫ్యాషన్ మరియు హై టెక్నాలజీ పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. మంత్రి కేటీఆర్ వెంట తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు ఉన్నారు.

- Advertisement -